వారఫలాలుః ఈవారం మహాశివరాత్రి అత్యంత పుణ్యదినంతో ప్రారంభం కానుంది. జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 15 అరుదైన గ్రహస్థితులు ఏర్పడనున్నాయి. ఈ వారం ప్రారంభం రోజున అత్యంత శక్తివంతమైన బుధాదిత్య యోగం, సర్వార్ధసిద్ది యోగం ఏర్పడనున్నాయని పండితులు చెబుతున్నారు. దీని వలన కొన్ని రాశుల వారికి అన్ని రకాల మంచి ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. మహా శివరాత్రితో ప్రారంభమయ్యే ఈ వారంలో12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
మేషరాశిః ఈ రాశి వారికి ఈ వారం అన్నివిధాలుగా కలసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి అవుతుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా కలసి వస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు.
ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు అందుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశిః ఈ రాశివారికి ఈ వారం పనిభారం పెరిగినా సంతృప్తికరంగానే జీవనం కొనసాగిస్తారు. ఉన్నతాధికారుల నుంచి అభినందనలు పొందుతారు. ఏదో తెలియని ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరితోను వాదనలు పెట్టుకోకండి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య పరంగా జలుబు.. దగ్గు.. కొద్దిపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మిథున రాశిః ఈ రాశి వారి కి ఈ వారంలో ఏర్పడే యోగాల వలన పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. గతంలో ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. కెరీర్ విషయంలో గతంలో ఉన్న ఇబ్బందులకు పరిష్కారం ఏర్పడుతుంది.
కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలమైన సమయం. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కర్కాటకరాశిః ఈ వారం.. ఈ రాశి వారికి సాధారణంగానే ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు. కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహరాశిః ఈ వారం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోయినా నష్టం ఉండదు. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. పెళ్లి విషయాన్ని వాయిదా వేయండి. చెబుతున్నారు. ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవద్దు. ఖర్చులు పెరిగే అవకాశం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు. దూరంగా ఉన్న ప్రేమికులు ఈ వారంలో కలుసుకునే అవకాశం ఉంది
కన్యారాశిః ఈరాశి వారికి మహాశివరాత్రి రోజు ఏర్పడే యోగాల వలన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనుకోకుండా ధన లాభం ఏర్పడే అవకాశం ఉంది. అప్పుల బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్లాన్ చేసే వారికి ఈ వారం అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
తులారాశిః ఈ వారం ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు సొంత కంపెనీ ఉంటే అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెరీర్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండదు. అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆఫర్ లెటర్ అందుకొనే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కోసం ఎదురు చేసేవారు గుడ్ న్యూస్ వింటారు.
వృశ్చికరాశిః ఈ రాశి వారు ఈ వారం కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారం కూడా దాదాపు బాగానే ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
ఆస్తుల విషయంలో కొన్ని అగ్రిమెంట్లు జరిగే అవకాశం ఉంది. గృహనిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు కలుగుతాయి.
ధనస్సురాశిః ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కలిగిన ఇబ్బందులకు ఉపశమనం కలుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. సమాజంలో గౌరవం .. కీర్తి పెరుగుతుంది.
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.
కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఈ వారంలో ప్రారంభించే కొత్త ప్రాజెక్ట్ లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. జాబ్ మారాలనుకునే వారికి ఈ వారం మంచి సమయం.నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మకర రాశిః ఈ రాశి వారికి ఈ వారంలో గతంలో ఆగిపోయిన పనులుపూర్తవుతాయి. ఉద్యోగస్తులకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్విషయంలో పురోగతి ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది.
పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మాట పట్టింపునకు పోకుండా మీ పని మీరు చేసుకోండి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు ఆశించిన సంస్థలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి: ఈ వారం మహాశివరాత్రి పుణ్యదినంతో ప్రారంభమైంది. జ్యో తిష్య శాస్త్రం ప్రకారం ఏర్పడే యోగాల వలన ఆస్తి యోగం కలిగే అవకాశం ఉంది. కుంభ రాశి వారికి ఈ మహా శివరాత్రి ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది అనుకూల సమయం. సామాజిక గుర్తింపు పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు మంచి ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
మీనరాశిః ఈ రాశి వారు ఈ వారం రిస్క్ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యం అయినా.. వారం మధ్యలో పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి. వారం చివరిలో కెరీర్ గురించి మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
